మనకు మొక్కలు ప్రాణాధారం .అంతే కాకుండా, ఈ మొక్కలు మనకు కావలసిన చాలా ఉపయోగాలను కలిగిస్తాయి. వాటిలో మనం ఈ రోజు నిమ్మ ఆకును లేదా నిమ్మ చెట్టు ఉపయోగాల గురించి తెలుసుకుందాం. నిమ్మకాయ గురించి మనకు బాగా తెలుసు కానీ మనం నిమ్మ ఆకును గురించి దాని పనితీరును గురించి తెలుసుకుందాం.నిమ్మ ఆకులో విటమిన్ సి, క్యాల్షియం,మెగ్నీషియం,పొటాషియం,సల్ఫర్ ,వంటి ఎన్నో ఔషగుణాలున్నాయి.అంతే కాకుండా యాంటీ బయాటిక్స్ గుణాలు ఇందులో చాలా ఉంటాయి.ఈ ఆకు ఉపయోగాలను గురించి తెలుసుకుందాం.

బాగా తల నొప్పిగా ఉన్నప్పుడు నిమ్మ ఆకును బాగా నలిపి వాసనను చూడడం వలన తల నొప్పి వెంటనే తగ్గిపోతుంది. నరాల నొప్పులు,కండరాల నొప్పులు, ఒత్తిడి, డిప్రెషన్,తలతిప్పడం,జలుబు,దగ్గు వీటిని తగ్గించుకోవడానికి ఒక్క గిన్నెలో నీటిని మరిగించి అందులో ఒక్క పది నిమ్మ ఆకులను వేసి మూత పెట్టాలి.ఒక్క ఐదు నిమిషాలు కాగినతరువాత ఆ నీటిని ఒక్క గ్లాస్ లో వేసుకుని తాగాలి దీనిని ఒక్క రోజులో రెండు సార్లు తాగడం వలన పైన తెలిపిన రోగాలను నివారించ వచ్చు. అంతేకాకుండా యాంటీ వైరల్ ఫీవర్ ను తగ్గిస్తుంది. కడుపునొప్పి, జాయింట్ పెయిన్స్, అజీర్ణ సమస్యల నుండి కాపాడుతుంది.

అంతే కాకుండా పిల్లలలోనూ, పెద్దల్లో కూడా నులి పురుగుల సమస్య చాలా బాధ పెడుతూ ఉంటుంది. దీనిని మనం పోగొట్టుకోవడానికి నిమ్మ ఆకులను బాగా దంచి వాటి రసం తీసి దానిని తేన లో కలిపి ఒక్క చెంచా అంత తీసుకోవాలి.దీని వలన కడుపు లో ఉన్న నులి పురుగులు చావడమే కాక ఎప్పటికీ నులిపురుగులు రావు. దీనిని పది రోజులు రెండు పూటలా తీసుకోవాలి.ఈ నిమ్మ ఆకు టీ నీ గ్రీన్ టీ లాగా తీసుకోవడం వలన ఉబ్బసం, శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు పూర్తిగా నశించి పోతాయి.అంతే కాకుండా నిమ్మ ఆకులను ,ఒక్క లవంగం వేసి మెత్తగా నూరి దానిని పంటి నొప్పి ఉన్న చోట పెట్టడం వలన పంటి నొప్పి సమస్య పూర్తిగా నయం అవుతుంది.