ఈ రోజు మనం ఎంతో విశేషమైన ఒక మిరాకిల్ మొక్క గురించి తెలుసుకుందాం.. అదే రణపాల మొక్క. ఈ మొక్కను ఆకు మొక్క అని కూడా పిలుస్తారు. దీనికి ఒక విశిష్టత ఉంది అదేమిటంటే అన్ని మొక్కలు వేరు నుంచి కాండం నుంచి విత్తనం నుంచి వస్తాయి కానీ ఈ చెట్టు మాత్రం ఆకు యొక్క కణుపుల నుండి కొత్త చెట్లు మొలుస్తాయి. ఒక ఆకుని మట్టిలో పూడ్చి పెడితే ఐదు మొక్కలు వరకు వస్తాయి. ఈ మొక్క ఆకు పండిన తరువాత రాలిన ఐదు మొక్కలకి ప్రాణం ఇస్తుంది. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి లో ఉండే సమస్య తెల్లజుట్టు మరియు జుట్టు రాలిపోవడం. ఈ సమస్యతో బాధపడే వారు ఈ రణపాల ఆకు ని గుజ్జులాగా చేసి జుట్టు కి రాసుకోవడం వల్ల జుట్టు మరియు జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు చాలావరకు తగ్గుతాయని శాస్త్రజ్ఞులు అంటున్నారు.

అదేవిదంగా షుగర్ మరియు బి పి తో బాధపడేవారు ఈ ఆకులను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల తొందరగా షుగర్, మరియు రక్తపోటు కంట్రోల్ అవుతుంది. మరియు చాలా మందికి కాలంతో సంబంధం లేకుండా సెగ గడ్డలు వస్తాయి అలా వచ్చినప్పుడు ఈ ఆకును మెత్తగా దంచి ఆ గడ్డలపై పెట్టడం వల్ల తొందరగా తగ్గిపోతాయి. ఇంకా కిడ్నీలో రాళ్లు ఉన్న వారు ఈ ఆకు రసంను పరగడుపున రెండు స్పూన్లు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగి, మూత్రంలో పడిపోతాయి. అదే విదంగా కిడ్నీ లను శుభ్రం చేసి వ్యర్థ పదార్థాలను తొలగించి, కిడ్నీలకు పునర్జీవం తెస్తాయి. అలాగే అసిడిటీ సమస్యతో బాధపడే వారు ఈ ఆకుని నోట్లో వేసుకుని చిన్నగా నమిలి ఆ రసాన్ని కొద్ది,కొద్దిగా మింగటం వల్ల ఉపశమనం పొందుతారు.

అలాగే తలనొప్పి, ఆస్తమా ఉన్నవారు ఈ ఆకు రసం పావు స్పూను తేనెతో కలిపి తీసుకోవడం వల్ల తలనొప్పి మరియు ఆస్తమా తొందరగా తగ్గుతుంది. ఈ రణపాల ఆకు మీద కొబ్బరి నూనె రాసి స్టవ్ మీద ఆకుని రెండు వైపులా వేడిచేసి ఎలాంటి నొప్పి ఉన్నా సరే దానిపై వేసుకొని కట్టుకట్టుకోవాలి. ఇలా మూడు రోజులు రోజుకి రెండు,మూడు సార్లు కట్టిన తర్వాత ఎలాంటి నొప్పులు అయినా సరే మోకాళ్ళ నొప్పులు అయినా సరే కింద పడ్డప్పుడు గట్టిగా తగిలిన ఎలాంటి నొప్పి అయినా సరే ఈ రణపాల ఆకు వేడి చేసుకొని కట్టడంవల్ల తొందరగా ఉపశమనం పొందుతారు. ఇది నేను స్వయంగా వాడి చూసి ఫలితం వచ్చిన తర్వాత నేను మీకు చెప్తున్నాను.