భారతీయ ఆలయాల విశిష్టత, గొప్పతనం, వాటి వెనుక ఉన్న స్థల పురాణం, వాటిచుట్టూ అల్లుకున్న కథలు, భక్తులని ఆచ్చర్యులని చేస్తుంది. అలా ఒక విలువైన రాళ్లతో ప్రసిద్ధి గాంచిన ఆలయం శ్రీ నీలం పాటి అమ్మవారి దేవాలయం. ఆలయ విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగోప్పల గ్రామంలో నీలంపాటి అమ్మవారు, శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయం ఉంది. పేరులో శ్రీలక్ష్మి అని ఉన్న ఈమెను పార్వతీ దేవి హంసగా భావిస్తారు. ఆలయ పురాణం విషయానికి వస్తే.. పూర్వం కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉండగ ప్రమథ గణాలు నాట్యం చేస్తున్నాయి, ఆ నాట్యంలో నంది, ఆసంపూర్ణుడు అన్నావు కాబట్టి నీ గర్భం లో నందీశ్వరుడు అసంపూర్ణుడిగా ఉంటాడు.

పెళ్లి కాకుండానే గర్భవతివి అయినా, నువ్వు నీ వాళ్ళు అగ్నికి ఆహుతి చేస్తారు. ఆ విధంగా నీవు మానవరూపం దాల్చి నీలంపాటి అమ్మవారి గా భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటావు. వారిచె పూజలు అందుకుంటారు అని చెప్పాడు. ఆ విధంగా శాపానికి గురైన పార్వతిదేవి సుమారు 700 ఏళ్ల కిందట గుంటూరు జిల్లా పల్నాటి ప్రాంతంలోని యాగంటి రామయ్య ఇంట్లో జన్మించింది. నలుగురు కుమారులు తర్వాత పుట్టిన ఆమెకు శ్రీ లక్ష్మీ అని పేరు పెట్టారు. రామయ్యకి పశుసంపదలో కామధేనువు అనే గోవు ఉండేది. శ్రీలక్ష్మి ప్రతిరోజు గోశాలకు వెళ్లి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి, గోవు పంచకాన్ని తాగుతూ ఉండేది.

ఒకరోజు ఆ కామధేనువుతో ఆంబోతు క్రిడించింది. ఆ విషయం తెలియని శ్రీలక్ష్మి రోజు లాగే వెళ్లి గోమాతను పూజించి, గో పంచకాన్నీ తాగింది. అప్పుడు ఆమె కొన్నాళ్ళకు గర్భవతి అయింది. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఆమెని వారి ఇంటి వారు అందరూ అవమానించారు. దాంతో కోపానికి గురైన ఆమె అన్నయ్యలు శ్రీలక్ష్మి పొలానికి పిలిపించి ఆమెకి నిప్పు పెట్టారు. మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియో చూడండి.