ఈరోజే మాఘ సోమవారం, ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు, మాఘమాసము అంటే సూర్యుడికి ఎంతో ఇష్టమైన మాసం, అదే విధంగా శివకేశవులకు కూడా ఎంతో ఇష్టమైన మాసమిది.

ఎంతో విశిష్టమైన ఈరోజు ఈ కథను విన్నా చదివినా చెప్పిన వినిపించిన, జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి. ఆ కథని ఇప్పుడు తెలుసుకుందాం, పూర్వకాలంలో ధర్మ దత్తుడు అనే వ్యాపారవేత్త ఉండేవాడు, అతడు కోట్లు సంపాదించాడు.

ఎంత సంపాదిస్తే మాత్రం ఏమి లాభం ఎప్పుడూ చూసినా అతడు బాధతో ఉండేవాడు, అది ఏంటి అంటే తన ప్రాణం పోతే ఆ దనాన్ని కూడా విడిచి పోవాల్సిందేగా అనుకుంటూ, ఎంతో బాధగా ఉండేవాడు. చనిపోయాక ఏమవుతుందో డబ్బు ఎలా తీసుకువెళ్లాలో చెబితే గొప్ప కానుక ఇస్తానంటూ ప్రకటించాడు ఆ వ్యాపారవేత్త. ఈ ప్రకటన విన్న ఒక జ్ఞాని ఒక రోజు ధర్మ దత్తుడి ఇంటికి వచ్చాడు, తన ఇంటికి వచ్చిన జ్ఞానిని చూసి ధర్మదత్తుడు సకల ఉపచారాలు చేసి ఇలా అన్నాడు.

స్వామి నా ప్రాణం పోతే ఈ ధనాన్ని కూడా వదిలి పోవాల్సిందేనా, నా ప్రాణం తో పాటు ధనాన్ని కూడా ఎలా తీసుకువెళ్లాలి అని అడిగాడు. దానికి ఆజ్ఞాని ఇలా సమాధానం చెప్పాడు, చూడు నాయనా నువ్వు విదేశాలకు వెళ్లినప్పుడు నీ డబ్బులు ఖర్చు పెడుతున్నావా అని అడిగాడు. దానికి ధర్మ దత్తుడు ఇలా అన్నాడు మన నోట్లు విదేశాలలో చెల్లవు కదా స్వామి, కాబట్టి ఆయా దేశాలకు అనుకూలంగా మార్చుకొని వినియోగిస్తున్నాను అని పలికాడు. అదంతా విన్న జ్ఞాని ఇలా పలికాడు అవును కదా మరణానంతరం నీ సంపాదన నీతో రావాలి అంటే, ముందుగా నువ్వు వెళ్లాలి అనుకున్న లోకాన్ని నిర్ధారించుకొని, దానికి తగిన విధంగా ధనాన్ని మార్చుకోవాలి.

నీవు నరకానికి వెళ్లాలి అనుకుంటే నీ డబ్బును వ్యసనాలు, చెడు కర్మలకు వినియోగించి పాపంగా మార్చుకో, అలా కాకుండా నీవు స్వర్గానికి వెళ్లాలి అనుకుంటే, ఆదనాన్ని దానధర్మాలు ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేసి పుణ్యం గా మార్చుకోవాలి జ్ఞాని చెప్పాడు. దీంతో అతనికి జ్ఞానోదయమై తన సొమ్మంతా తీసుకోమన్నాడు, కానీ జ్ఞాని కష్టపడకుండా ఉచితంగా వచ్చేది తనకు వద్దు అన్నాడు, తరువాత ధర్మ దత్తుడు ఆ సంపదను పుణ్య కార్యక్రమాలకు వినియోగించి సర్గతులను పొందాడు మనం సంపాదించింది, మరణానంతరం వెంట తీసుకువెళ్లొచ్చు అంటే వివేకానందుడు చెప్పిన కథ ఇదే. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.