ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు, మహాశక్తివంతమైనటువంటి రోజు అమావాస్య గురువారంతో కూడి వచ్చింది. సాయంకాలం 5:30 వరకు అమాస గడియలు ఉన్నాయి.

అదేవిధంగా పూర్వాషాడ నక్షత్రం సాయంకాలం 5:30 లోపు ఉంది. గురువారము అంటే లక్ష్మీప్రదమైనటువంటి వారము అమావాస్య అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అయినటువంటి తిది. ఆదివారం అమావాస్య వస్తే ఎలా శక్తి కలిగి ఉంటుందో, గురువారం అమావాస్య వస్తే కూడా అంతే శక్తి కలిగి ఉంటుంది.

ఈరోజు మూడు చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే, మీ ఇంటికి తగిలినటువంటి దృష్టి మీ వ్యాపారానికి తగిలినటువంటి దృష్టి, మీకు తగిలినటువంటి దృష్టి పరిపూర్ణంగా తొలగిపోతుంది. ఇంటికి తగిలినటువంటి నర దృష్టి నర పీడ సమూలంగా నివారణ కలుగుతుంది, అసలు ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇంటికి గుమ్మడికాయ కట్టాలి అనుకుంటున్నాము, బూడిద గుమ్మడికాయ ఎప్పుడు కట్టాలి అని చాలా రోజులుగా అడుగుతున్నారు చాలామంది. గుమ్మడికాయ తీసుకొని వచ్చి ఇంటికి కడతాం కానీ ఎటువంటి ఫలితము కూడా ఉండదు, ఎందుకంటే బూడిద గుమ్మడికాయ మనం సరైన సమయంలో సరైన ముహూర్తంలో కట్టాలి. ఇంటికి తగినటువంటి నరదృష్టి నరగోష తొలి పోవాలి సంపూర్ణంగా అంటే, దానికి ఒక ముహూర్తం ఉంటుంది. అమావాస్య ఘడియలు చాలా పవిత్రమైనవి.

ముఖ్యంగా అమావాస్య గురువారం రోజు వచ్చిన ఆదివారం రోజు వచ్చిన చాలా శక్తిని పొందుకొని ఉంటుంది. ఈరోజు సాయంత్రం 5:30 వరకు అమావాస్య ఘడియలు ఉన్నాయి. కాబట్టి వీలున్నటువంటి వాళ్ళు ఈరోజు ఈ పరిహారం చేసుకోండి. ఈరోజు కుదరనీ అటువంటి వాళ్ళు ఆదివారం మకర సంక్రాంతి ఉంది కదా, అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టే, దానినే మకర సంక్రాంతి అంటారు. ఆ రోజైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు, ముఖ్యంగా ఈరోజు సాయంత్రం లోపల ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని, ఈ గుమ్మడికాయ తీసుకొని వచ్చేటప్పుడు, పొరపాటున కూడా కింద పెట్టకూడదు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.