ఈనెల 8న మహాశివరాత్రి రాబోతూ ఉంది. మాఘ బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను మనమందరం భక్తిశ్రద్ధలతో చేసుకుంటాం. ఈసారి మహాశివరాత్రి శ్రవణా నక్షత్రం, ధనిష్ట నక్షత్రం శుక్రవారం తో కలిసి వచ్చింది.

ఇలాంటి శివరాత్రి 349 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్లీ ఇప్పుడు అలాంటి మహాశివరాత్రి వచ్చిందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కాబట్టి 349 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ మహాశివరాత్రి చాలా అరుదైనది. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి, ఉపవాసం అంటే మన మనసుని శివుడికి దగ్గరగా ఉంచమని అర్థం.

శివ ధ్యానం చేయాలి అలా చేస్తే ఏం జరుగుతుందంటే శివానందం లభిస్తుంది. మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైన ఆనందం ప్రతి మానవుడు దుఃఖాన్ని కోరుకోడు, ప్రతి ఒక్కరూ ఆనందాన్ని కోరుకుంటారు, కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు. దానిని పొందాలి అంటే ఏదో ఒక మార్గం ఉండాలి. ఆ ఆనందాన్ని పొందాలంటే మార్గం ఏంటంటే శివనామస్మరణ, మహాశివుడు ఆనంద స్వరూపుడు అలాంటి మహాశివుడిని మనసులో తలుచుకుంటే,

మనకు శివానందం కలుగుతుంది, కానీ అలా ఆనందాన్ని పొందాలి అంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే, అది సాధ్యపడదు నిద్ర వస్తుంది. అలానే మన మనసు ఇతర విషయాలపై వెళుతుంది కాబట్టి, ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి. వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు పసిపాపలు, గర్భిణీ స్త్రీలు వీళ్ళకి ఈ నియమాలు వర్తించవు, అలానే బిపి షుగర్ ఉన్నవాళ్లు కూడా అల్పాహారం తీసుకోవచ్చు. ఎందుకంటే వారి శరీరం తట్టుకోలేదు కాబట్టి ఆరోగ్యాన్ని మించినది ఏదీ లేదు, ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి.

మీ శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇవ్వండి, సంవత్సరం అంతా పనిచేసిన మన శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇస్తే ఎంతో సంతోషపడుతుంది, అయితే మేము తినకుండా ఉండలేము అనేవారు అలాంటివారు కొద్దిగా ఫలహారం తీసుకోండి. ఇది అందరికీ కాకుండా చేయలేని వారికి మాత్రమే లేదా, సీజనల్ పండ్లు తినండి .శివరాత్రికి మనకు సపోటా పుచ్చకాయ ఇలాంటి పనులు దొరుకుతాయి, పరిమితంగా అరటి పనులు తినాలి. ఎక్కువగా అ రటి పండ్లు తినకూడదు, లేదా ఫ్రూట్ జ్యూస్ తాగవచ్చు ఇక మరి ఉండలేని వారు రెండు లేదా మూడుసార్లు నిమ్మరసం తాగుతూ ఉండాలి. ఇలా తాగడం వల్ల శక్తి వస్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.