2024లో ఫిబ్రవరి 24న మాఘ పౌర్ణమి రాబోతూ ఉంది. సంవత్సరానికి నెలలు 12 నెలకు ఒక పూర్ణిమ, ఇది సర్వసాధారణం. ఆకాశంలో గ్రహాలు తిరుగుతూ ఉండడం మూలాన,

అమావాస్యలు పూర్ణిమలు మనకు లెక్కలోనికి వస్తాయి. శాస్త్రీయంగా చంద్రుడు భూమి సూర్యుడు గమనాల బట్టి పగలు, రాత్రులు నెలలు సంవత్సరాలు అని మనం లెక్కలు వేసి అనుకున్నవే. దీనినే క్యాలెండర్ అంటాము. తేదీలలో పూర్ణిమైనా సరే ఆ పూర్ణిమకు సంబంధించిన దేవతారాధన చేస్తే

ఎన్నో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి, పూర్ణిమ నాడు తెల్లవారుజామున వెళ్లి సముద్ర స్నానం చేయడం మంచిది. పూర్ణిమ కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ వైశాఖ మాసంలో వచ్చే పూర్ణి మలు, ఎంతో ఉత్కష్టమైనవి. ఆపూర్ణిమలలో చేసే దేవతారాధన మరింత శ్రేష్టమైనది ఈ రోజున ఏ నియమాన్ని పాటించిన, అది విశేష ఫలితం ఇస్తుంది. మాఘ పూర్ణిమ విశిష్టత అంతా కాదు

హిందువులు భక్తితో కొలిచే పర్వదినం ఇదే. ఈ రోజున భక్తులు పవిత్ర నదిలో స్నానం చేయడం, దానం చేయడం మొదలైన వాటిని అనుసరిస్తారు. మాసాలన్నింటిలో మాఘమాసం చాలా విశిష్టమైనది. దీనిలో ఎటువంటి సందేహము లేదు.

ఎందుకంటే రథసప్తమి, భీష్మ ఏకాదశి, శ్రీ పంచమి, మహాశివరాత్రి ఇలా సకల దేవతలను ఈ నెలలో కొలుస్తాము. మాఘ పౌర్ణమి నాడు గంగానదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది, లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా, దేవాలయాలలో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు. ముఖ్యంగా కాశీ ప్రయాగ హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాలలో ఉంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.