కరోనా వైరస్ కొట్టిన దెబ్బకి ప్రజలు బాగా ఇబ్బందులు పడ్డారు. దానినుండి ఉపశమనానికి రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు అనేక మందులు చిట్కాలు పాటించేసారు కూడా. కానీ ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలు మనల్ని కరోనా రాకుండా అఢ్డుకోవడంతో పాటు మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆవేంటో ఏలా వాడాలో చూసేద్దాం. మనకి స్వీట్స్లో ఉపయోగించే పచ్చకర్పూరం గురించి తెలిసే ఉంటుంది. దీనిని స్వీట్స్ లోనే కాకుండా జండుబామ్ లాంటి నొప్పి నివారణ మందుల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. దీని ఘాటైన వాసన వల్ల క్రిములు, బ్యాక్టీరియా వంటివి దరిచేరవు. అందుకే దీనిని నీటిలో వేసి ఆవిరి పట్టాలి.ఇలా చేయడం వల్ల ముక్కు, నోట్లోని వాయునాళాలు శుభ్రపడి ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి.

అలాగే దీని వాసన చూడడం వల్ల మనసులోని ఆందోళనలు, భయం పోయి మనసు తేలికగా అనిపిస్తూ ఉంటుంది. నిద్రలేమి ఉన్న వాళ్లు కూడా దీని వాసన పీల్చడం మంచి ఉపశమనం కలిగిస్తుంది కాకపోతే ఇంట్లో ఫిట్స్ ఉన్నవారు పిల్లలు లేదా పెద్దలు ఎవరైనా సరే దీని వాసన పీల్చకూడదు. అలాగే మరో చిట్కా ఏంటంటే మన అందరి ఇంట్లో ఉల్లిపాయలు తప్పకుండా ఉంటాయి అందులోనుంచి ఒక ఉల్లిపాయ తీసుకొని కింద భాగం కాకుండా పైన వేళ్లతో ఉండే భాగాన్ని కట్ చేసి పడుకునేటప్పుడు తల దగ్గర పెట్టుకొని పడుకోవాలి. ఇలా చేయడం వలన ఉల్లి లో ఉండే ఘాటైన వాసనకు బ్యాక్టీరియాలాంటివి దరిచేరవు. దీని నుంచి వెలువడే సల్ఫర్ క్రిములను నాశనం చేస్తుంది.