ఈరోజు మనం శరీరంలో ఉన్నటువంటి, అతి వేడిని ప్రాణాయామ సాధన ద్వారా, ఏ విధంగా తగ్గించుకోవచ్చు తెలుసుకుందాం, ఈ ప్రాణాయామాన్ని శీతలీ ప్రాణాయామం అంటo, ముందు శీతలీ ప్రాణాయామం, ప్రాక్టీస్ చేసే ముందు ఈ ప్రాణాయామాన్ని ఎవరు చేయవచ్చు, ఎవరు చేయకూడదు, అనే విషయం గురించి తెలుసుకుందాం, శీతలీ ప్రాణాయామం అనేది, శరీరం బాగా అతి వేడి తో బాధపడుతూ ఉండే వాళ్ళు, కళ్ళు మంటలతో ఉండే వాళ్ళకి, బాగా వేడి ఎక్కువ అయినప్పుడు, మూత్రం లో మంట రావడం, కళ్ళవెంట మంట రావడం, కళ్ళ వెంట నీరు కారడం, లోపలి నుండి వేడిగా సెగలు వస్తున్నట్లుగా ఉండడం, ఇలాంటి సింప్టమ్స్ అనేవి, జనరల్గా కొంతమందికి కనిపిస్తూ ఉంటాయి.

ఇది బాడీ లో బాగా వేడి చేయడం వల్ల, వచ్చే సింటమ్స్ అన్నమాట, ఈ వేడిని కంట్రోల్ చేసుకోవడానికి, అంతేకాకుండా ఎక్కువగా ఆకలి వేస్తూ ఉంటుంది, ఎందువల్లనంటే బాడీ ఎక్కువగా, అతి వేడి ఉండడం వల్ల, త్వరగా జీర్ణం అయిపోయి, మల్ల ఏదో ఆకలి వేస్తుంది, ఏదో తినాలి అనే కోరిక జనరల్గా జరుగుతూ ఉంటుంది, అలా ఎక్కువ ఆకలి కలిగే వాళ్లకి, అదే విధంగా ఎక్కువ వేడి చేస్తున్నప్పుడు, దాహం కూడా ఎక్కువగా వేస్తూ ఉంటుంది, సో అలాంటి దాహాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, జీర్ణ వ్యవస్థ కరెక్టుగా పనిచేయడానికి, ఈ శీతలీ ప్రాణాయామం అనేది, బాగా ఉపయోగపడుతుంది.

అంతేకాకుండా ఈ శీతలీ ప్రాణాయామం, చేసే ముందు వాళ్లకి బ్రాంకైటిస్ ప్రాబ్లం, సైనస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కాని, ఆస్తమా ప్రాబ్లం ఉన్నవాళ్లు, ఎక్కువగా కోల్డ్, కాఫ్ ప్రాబ్లం తో, సఫర్ అయ్యే వాళ్లు, ఈసీతలి ప్రాణాయామానికి, దూరంగా ఉంటే మంచిది, ఇప్పుడు మనం శీతలీ ప్రాణాయామం అనేది, ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం, శీతలీ ప్రాణాయామం అనేది, మూడు దశలుగా ఉంటుంది, ఒకటి మొదటిదశలో గాలిని తీసుకోవడం వదలడం, అనేది మొదటి దశ, రెండవది కుంభ కాళ్లతో చేస్తాము, అంతర కుంభకం అంటారు.

అంటే గాలిని తీసుకుని, లోపల కొంచెం సేపు కుంభించి అంటే, గాలిని కొంతసేపు లోపల ఆపి ఆ తర్వాత, శ్వాసను కంప్లీట్గా బయటికి వదలడం, మూడవది బాహ్య కుంభకం అంటే, గాలి ని బాగా తీసుకుని, పూర్తిగా బయటకు వదిలేసి తర్వాత హోల్డ్ లో ఉంటాం, అంటే గాలినే తీసుకోకుండా, బాహ్యకుంభకం లో ఉండడం, ఇలా ఈ శీతలీ ప్రాణాయామం అనేది, మూడు దశల వారీగా సాధన చేయాలి, మొదటిదశలో ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం