ఈ రోజు మనం ఒక అద్భుతమైన మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మొక్క పేరు కటేరి మొక్క, ఈ మొక్క ఎక్కువగా అడవి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని కంటకారి మొక్క అని కూడా పిలుస్తారు. దీన్ని వివిధ ప్రాంతాలలో, వివిధ భాషల్లో, వివిధ పేర్లతో పిలుస్తుంటారు.

ఈ మొక్క వల్ల అనేక రోగాలు తగ్గుతాయి, ఈ కంటకారి మొక్క దంతాల లో ఉండేటటువంటి క్రిమి,కీటకాల ని నాశనం చేస్తుంది. ఈ కటేరి మొక్క మూడు రకాలుగా ఉంటుంది, చిన్న కటేరి, పెద్ద కటేరి, తెల్ల కాటేరి. ఇది భారతదేశంలో ఉష్ణ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది. మీరు వీటిని ఎక్కువగా రాళ్ళల్లో , కాలువల పక్కలో చూడవచ్చు. ఈ చెట్లు ఎక్కువగా అలాంటి ప్రదేశాల్లో పెరుగుతాయి. మనం ఇప్పుడు చిన్న కంటకారి మొక్క గురించి తెలుసుకుందాం.

వీటి పూలు బ్రింజాల్ కలర్ లో ఉండి, కాయలు పచ్చ రంగులో ఉంటాయి. ఈ కాయలు పండిన తర్వాత పసుపు కలర్ లోకి మారుతాయి. ఈ కాయలు చిన్నగా గుండ్రంగా ఉంటాయి. దీనిలో ఉన్న గింజలు పళ్ళ లో ఉన్న క్రిములని నాశనం చేయటానికి ఉపయోగపడతాయి. దంతాలలో క్రిములు ఉన్నట్లయితే పుచ్చిపోయి చాలా నొప్పిని కలుగజేస్తుంది.

దీన్నే కావిటీ అంటారు. ఈ సమస్యని పరిష్కరించడం కోసం అనేక మంది హాస్పిటల్ చుట్టూ తిరిగి అనేక మందులు వాడుతుంటారు. ఈ సమస్యను తగ్గించడానికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. దాన్ని అందరూ చేయించుకో లేరు కూడా. సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ కంటకారి మొక్క ద్వారా ఈ సమస్యను సులభంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం..మొదటగా ఈ చెట్టును వేళ్ళతో సహా తీసుకువచ్చి ఎండబెట్టాలి, దీని కోసం పూలు పళ్ళు అన్నీ ఉన్న చెట్టు ని మాత్రమే ఎంచుకోవాలి. ఈ చెట్టు పూర్తిగా ఎండిన తర్వాత చిన్నచిన్న ముక్కలుగా చేసి, నీళ్లలో వేసి మరిగించాలి.

ఇది బాగా మరిగిన తర్వాత ఈ వాటర్ ని వడపోసుకొని వీటితో బాధపడేవారు ఆ వాటర్ తో పుక్కిలించాలి. ఇలా పుక్కిలించడం వల్ల మీ దంతాలలో ఉన్న క్రిములు అన్ని బయటకు వచ్చేస్తాయి. ఈ కటారి వాళ్ళ వేరొక ఉపయోగం ఏమిటంటే, బాగా పండిన కటారి కాయల్లో గింజల్ని తీసుకుని ఒక గుడ్డలో కట్టి చుట్టాలి. వీటిని ఒక గిన్నెలో వేసి మరిగించాలి, దీని ద్వారా వచ్చే పొగ ని ఒక బాటిల్ ద్వారా నోట్లో కి వచ్చే విధంగా చేసుకోవాలి. సో ఇలా పొగ నోట్లోకి రావటం వల్ల దంతాల్లో ఉన్న క్రిములు, కీటకాలు బయటికి వచ్చేస్తాయి. అంతేకాకుండా మీ పంటి నొప్పి సమస్య కూడా పూర్తిగా సమసిపోతుంది. ఈ ప్రయోగాన్ని చాలామంది ఉపయోగించి మంచి ఫలితాలను పొందారు.