ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఎక్కువ మందిని బాధిస్తున్న సమస్య మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి. ముఖ్యంగా పాదాలు, మడమల నొప్పులు అనేవి చాలా కీలకమైనవి, ముక్యంగా ఈ నొప్పిలన్నిటికి కారణం చాలా మంది ఓబీసిటీ అనుకుంటూ ఉంటారు. కానీ సన్నటి వాళ్లు కూడా ఇలాంటి నొప్పులతో చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ నొప్పులు ఎందుకు వస్తాయి మీకు తెలుసా..? మనకు ఎక్కడయితే నొప్పిగా ఉంటుందో, అక్కడ మనకు ఆక్సిజన్ తగ్గుతుందని అర్థం. అయితే ఆక్సిజన్ పెంచే ఒక ఆయుర్వేద విధానం ఏమిటంటే ఆవునెయ్యిని గోరువెచ్చగా చేసి చుక్కలు వేసుకోవాలి. అలాగే మీరు ఒక రెమెడీని కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ రెమెడీ కోసం మనకు కావాల్సింది జిల్లేడు ఆకులు.

ఇదేంటి అనుకుంటున్నారా అవును జిల్లేడు ఆకులు. ఫ్రెండ్స్ వృక్షజాతిలో జిల్లెడు చెట్టు ఒక చిన్న మొక్క. దీనికి ఆయుర్వేదం లో ఒక విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా ఈ జిల్లేడు లో రెండు రకాలు ఉంటాయి ఒకటి వంగపూవు రంగు పూలు పూసే జిల్లేడు మరియు తెల్ల జిల్లేడు. దీన్ని హేరంబ గణపతికి ప్రతీక గా కొలుస్తారు. దీనిలో ఔషధ గుణాలు కూడా ఎక్కువే, ముఖ్యంగా ఇది చర్మ సమస్యలు కానీ శరీరంలోని అనేక రకాల రోగాలు తగ్గించడం కానీ, కీళ్లకు సంబంధించిన సమస్యలు తగ్గించడానికి తనకి ఒక గొప్ప మందు అని మన ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది. అయితే ఈ రోజు చెప్పబోయే రెమిడీకి మీరు తెల్లజిల్లేడు లేకపోతే ఈ రెండింటిలో ఏ చెట్టు ఆకునైనా ఉపయోగించుకోవచ్చు.

మంచి ఫలితాల కోసం ఈ ఆకును ఎలా ఉపయోగించుకోవాలో ఈ క్రింది వీడియో లో చూద్దాం.