పళ్ళు గార పట్టి పసుపు రంగులో కనిపిస్తూ, చూడడానికి చాలా అసహ్యంగా దుర్వాసన వస్తూ, ఇలాంటి సమస్యల్ని చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు.

దీనికి అనేక కారణాలు ఉండవచ్చు, మనం తినే ఆహారం మనం తాగేటటువంటి పానీయాలు, లేదంటే సరిగా నోటిని శుభ్రం చేసుకోకపోవడం, కొన్ని సందర్భాలలో వంశపారపర్యంగా వచ్చేటటువంటి వ్యాధుల కారణంగా కావచ్చు, లేదంటే మధ్యపానం ధూమపానం లాంటి అలవాటు పడినప్పుడు కావచ్చు,

లేదంటే కిల్లిలు ఇలాంటివి అమితంగా తినడం వల్ల కావచ్చు, కారణం ఏదైనా కూడా అనేకమంది ఈ పళ్ళ యొక్క రంగు లేదా, దుర్వాసన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా నోటిలో నుంచి చెడు వాసన రావడం, అలాగే చూడడానికి పళ్ళు చాలా అసహ్యంగా కనిపించడం, పసుపు రంగు లో కనిపించడం ఇలాంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, వారు తప్పకుండా చూడండి.

మీ పంటి యొక్క అనేక సమస్యల్ని పారద్రోలేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంతటి గార పట్టిన పళ్ళైనా సరే ఈ చిట్కాని ఫాలో అయితే కచ్చితంగా మీకు మీ పంటి యొక్క గార మొత్తం తొలగిపోతుంది. చిట్కాకి మీకు కావలసింది ఏంటంటే అధిక యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగినటువంటి వంటింట్లో ఉపయోగించేటటువంటి పసుపు, ఆశ్చర్యంగా అనిపించవచ్చు దాదాపు మన శరీరంలో వచ్చే ఎన్నో సమస్యలకి పసుపు చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది.

అలాగే ఉప్పు ఉప్పు కూడా పంటి సమస్యలకు ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నూనెను కూడా ఈ పరిహారం కోసం వాడాలి, ఒక చిన్న గిన్నె తీసుకొని దానిలో అర స్పూన్ పసుపు, అర స్పూన్ ఉప్పు వేసి దానిని ఒక పేస్టులా చేసుకోవడం కోసం దానిలో కొంచెం కొబ్బరి నూనెను వేయండి. కొంచెం పేస్టు తీసుకొని వీటన్నింటినీ ఒక మిశ్రమం లాగా కలపండి. దీనిని మీరు రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని బ్రష్ మీద పెట్టుకొని రాత్రిపూట పళ్ళంతా క్లీన్ చేసుకోండి. గార పట్టిన ప్రాంతంలో ఇంకా ఎక్కువగా క్లీన్ చేయండి. కనీసం ఏడు నుండి పది రోజులపాటు ప్రతిరోజు రాత్రి చేయండి. మీ పళ్ళకు పట్టిన గార పది రోజుల్లో ఇట్టే తొలగిపోతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.