ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నిలబడడం చాలా కష్టం. ఆనాడు చిరంజీవి నుంచి నేటి న్యాచురల్ స్టార్ నాని వరకు కేవలం పదుల సంఖ్యలో మాత్రమే చెప్పుకోవడానికి ఉన్నారు. ఇలాంటి వారు వాళ్ల స్వయంకృషి తో, వాళ్ళ టాలెంట్ తో, లక్ తో ఇంత స్టేజ్ కి వచ్చిన వాళ్ళు కూడా కొందరు ఉంటే మరికొందరు మాత్రం ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ హీరోలుగా, హీరోయిన్లుగా, దర్శకుడిగా తమ మార్కు ను సంపాదించుకున్నాఋ.

ఒక్క హిట్ వస్తే చాలు వాళ్ళ వెంట దర్శకులు పడతారు, నిర్మాతలు కాల్ షిట్ కోసం వస్తారు. అదే హీరో కి ఫ్లాప్ వచ్చిందంటే పదేళ్ల వరకు అతని వంక ఎవ్వరు చూడరు ఇది ఏ చిత్ర పరిశ్రమలోనైనా కనిపిస్తుంది. కమర్షియల్ హీరోలకి ఇది మరింత తెలిసిన విషయం, అందుకే చాలా మంది హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటారు అందుకే తమ ఫేమ్ ఉన్నంత వరకు మంచిగా సినిమాలు చేసుకుంటూ అదే రేంజ్ లో ఫాలోయింగ్ పెంచుకుంటూ యిటు రెమ్యునేషన్ తగ్గించకుండా ముందుకు సాగిపోతూ ఉంటారు.

ఇలా ఆ దారిలో సక్సెస్ అయినా వాళ్ళు కొందరే ఉంటారు అలా వచ్చి ఇలా కనిపించకుండా పోయిన తారలు ఎందరో ఉంటారు. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి హీరోలు హీరోయిన్లు చాలా మంది ఉన్నారనే చెప్పాలి కొందరు మంచి విజయాలు అందుకున్న తర్వాత కూడా వెండితెరపై మళ్ళీ కనిపించలేదు. అలాంటి వాళ్లలో హీరో రాజా కూడా ఒకరు. రాజా అంటే చాలా మందికి ఒక ఐడియా ఉందో లేదో కానీ ఆనంద్ సినిమాలో హీరో అంటే ఇట్టే గుర్తు పడతారు. మంచి కాఫీ లాంటి సినిమాతో వచ్చిన ఆయన అంతే విధంగా అందరినీ అలరించారు. మంచి హీరో అనిపించుకున్న స్మార్ట్ లుక్స్ ఉన్నటువంటి హీరో, శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం 2004లో విడుదల అయ్యింది. అదే రోజు చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ విడుదలైతే కూడా తట్టుకొని మరి బ్లాక్ బస్టర్ అందుకుంది.

ఈ సినిమా తర్వాత నాకు మంచి నేమ్ వచ్చింది, వెంటనే వెన్నెల, మాయాబజార్, మొగుడు పెళ్లాం ఓ దొంగోడు, ఇంకోసారి, ఓ చిన్నదానా లాంటి సినిమాలు కూడా చేసే మంచి హిట్ ను అందుకున్నాడు, వీటిలో కొన్ని విజయాలు ఉన్నాయి, కొన్ని అపజయాలు కూడా ఉన్నాయి. అయినా కూడా రాజా హీరోగా నిలదొక్కు లేకపోయాడు, దానికి కారణం తనకు బ్యాక్ గ్రౌండ్ లేకపోవడమే. సినిమా పరిశ్రమలో ఇక్కడ ఏదైనా జరిగితే వెనక నిలబడడానికి అండ ఉండాలని లేకపోతే నిలబడడం కష్టం అంటున్నారు రాజా తాను అంత హటాత్హుగా సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం కూడా అదే అని చెబుతున్నాడు.

ఒకటి, రెండు సంఘటనలు చూసిన తర్వాత తప్పకుండా అని చెప్పుకొచ్చాడు. తాజాగా ఆలీతో సరదాగా షో కి వచ్చాడు రాజా, అలీ అడిగిన కొన్ని ప్రశ్నలకు లేదనకుండా సమాధానమిచ్చాడు. ఒకానొక సమయంలో నువ్వు చనిపోయారని వార్తలు వచ్చాయి, ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం చేశారు, ఏంటి ఆ స్టోరీ అని అడిగాడు ఆలీ, దానికి రాజా కూడా అదే స్థాయిలో సమాధానమిచ్చాడు. వాడి కి సినిమాలు లేవు అవకాశాలు ఇవ్వడం లేదు దాంతో డిప్రెషన్ లోకి వెళ్లి పోయే ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ రాసారని, ఆవేదన చెందాడు రాజా. బతికున్న మనిషిని చంపడం కరెక్ట్ కాదు అని చెప్పాడు, ఆ వార్తలు నాకు చాలా బాధ కలిగించాయని చెప్పాడు, ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయిన, మత ప్రబోధకుడు గా మారి పోయానని చెప్పాడు.

https://youtu.be/QC1LxpDba9g?t=8

రాజా ప్రస్తుతం పాస్టర్ గా చాలా బిజీ అయిపోయా అని చెప్పాడు. రాజా ఇరు తెలుగు రాష్ట్రాలలో ప్రతి సభలలో చాలామంది క్రైస్తవులు కూడా హాజరవుతుంటారు. ఇంకా సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదని చెబుతున్నాడు యంగ్ హీరో, మొత్తానికి ఆనంద్ సినిమా మాత్రం ఒక అద్భుతమైన సినిమా లాగానే చెప్పాలి. ఎప్పటికీ ఇది ఒక మంచి కాఫీ లాంటి సినిమా అని గుర్తుంటుంది మన టాలీవుడ్కి. అయినా మరి సినిమాలు చేయను అంటున్నారు కానీ సినిమా పరిశ్రమలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని ఆయన అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు.