ఆకాశం నుంచి వింత వింత జీవులు నేలపై పడిన సందర్భాలు చూశాం, అలాగే భారీ సుడిగాలుల కారణంగా జనాలు ఇబ్బందులు పడిన సందర్భాలను చూశాం.

అయితే కొన్నిసార్లు అంతకుమించి, ఎగా అన్నట్లుగా వింత వింత ఘటనలు చోటు చేసుకుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇతర ఘటనకు సంబంధించిన వీడియో, ఒకటి నెట్ చెక్కర్లు కొడుతుంది.

ఆకాశంలో వింత దృశ్యం చూసి అంతా, మొదట సుడిగాలి వస్తుందేమో అనుకున్నారు. అయితే తీరా సమీపానికి వచ్చాక చూస్తే ఒక్కసారిగా కంగు తిన్నారు. సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. పూణేలోని ముఠా తీరంలో ఇటీవలే షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒకరోజు నదికి సమీపంలో ఆకాశంలో వింత దృశ్యం కనిపించింది.

దానిని చూసి అందరూ సుడిగాలేమో అనుకున్నారు, అయితే సమీపానికి రాగానే ఒకసారిగా షాక్ అయ్యారు. దోమల గుంపు తెరలు తెరలుగా అచ్చం సుడిగాలి తరహాలో దూసుకురావడం చూసి. వామ్మో ఇది ఎక్కడి వింతరా నాయనా అని అనుకుంటూ, కొందరు అక్కడి నుండి పరుగులు తీశారు. మరికొందరు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

నదిలో కాలుష్యం పెరిగిపోవడానికి, ఇదే నిదర్శనం అనే స్థానికులు వాపోతున్నారు. తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కాగా ఏ దోమల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో, తెగ హల్చల్ చేస్తుంది. దీనిపై నేటిజన్లో వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వామ్మో ఇలాంటి దృశ్యం ఎక్కడా చూడలేదు, అంటూ కొందరు పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అని, మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.