యూఎస్ లో ఎమ్మెస్ చేయాలని చాలామంది కలలు కంటారు. చదువు పూర్తి చేసుకొని అక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటారు. కానీ అక్కడ పరిస్థితులు మాత్రం కొంచెం ఆందోళనకరంగానే ఉన్నాయి.

వివక్ష కారణంగా భారతీయ విద్యార్థులు అక్కడ అనేక సమస్యలను ఎదుర్కోవడమే కాదు, ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల వరస మరణాలపై, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సగటున రోజుకు ఒక భారతీయుడు మరణిస్తున్నట్టు టీ మేడని స్వచ్ఛంద సంస్థ తెలిపింది.

భారత్ నుంచి అమెరికా వచ్చే వారికి భద్రతపై సరైన అవగాహన ఉండడం లేదు, తాజాగా ఇండియా స్టేట్లో సమ్మతనే భారతీయ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. తుపాకీతో తలపై కాల్చుకొని మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు గత నెలలోనూ జార్జియా వివేక్ సైన్య అనే విద్యార్థి ఒక వ్యక్తి మాదకద్రవ్యాల మత్తులో,

సుత్తితో కొట్టి చంపేశాడు. అమెరికాలో చాలామంది విద్యార్థులు రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు దాడుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం యుఎస్ లో భారతీయ విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను అమెరికా పంపేందుకు తల్లిదండ్రులు చాలా డబ్బులు పెట్టి పంపిస్తున్నారు. అక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో, చాలా మంది నర్వస్ కి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

చాలా ఏళ్లుగా భారత్ నుంచి అమెరికా వచ్చిన విద్యార్థులు, అనేకమంది కష్టాల పాలవుతున్నారు వారిలో కొంతమంది చనిపోతున్నారు. అయితే మృతులలో ఎక్కువగా విద్యార్థులతో పాటు ఇటీవలే అమెరికా వచ్చిన h1b ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో చదివినంత మాత్రాన హెచ్ వన్ బి వీసా వస్తుందన్న గ్యారెంటీ లేదు. చదువు పూర్తయిన తర్వాత హెచ్ వన్ బి వీసా రాకపోవడంతో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.