సంపద కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఐశ్వర్యం ఉన్నప్పుడే, ఆర్థిక సమస్యలు లేకుండా జీవితం సాఫీగా ఉంటుంది. ఐశ్వర్యాన్ని ఇష్టపడని మనిషి ఉండరు. సంపదను సమకూర్చే శ్రీ మహాలక్ష్మీదేవి అంటే అందరికీ ఇష్టమే. ఆమె అనుగ్రహం పొందడానికి ఎన్నో పూజలు చేస్తాం, అయితే ఇవి మూఢ నమ్మకాలని కొట్టిపారేసే వాళ్లు కూడా ఉన్నారు. ఇది శాస్త్రం కాదని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు అప్పుల్లో, నష్టాల్లో ఉండేవాళ్ళు మహాలక్ష్మి అనుగ్రహం పొందడానికి కొన్ని చిట్కాలు ఉంటాయి.

అదే ఐశ్వర్య దీపం, మహాలక్ష్మి అనుగ్రహం కోసం, ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి. శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందే లేచి పనులన్నీ పూర్తి చేసుకొని, ఐశ్వర్య దీపాన్ని సూర్యోదయానికి ముందు, సూర్యోదయం తర్వాత, మరొకసారి వెలిగించి పూజలు చేయడం వల్ల ఐశ్వర్యం సిద్దిస్తుంది. ఈ దీపం వెలిగించడానికి ఒక ఇత్తడి ప్లేటు తీసుకుని, అందులో రెండు వెడల్పాటి ప్రమిదలను ఉంచండి. అక్షింతలు, బెల్లం ముక్క, కలకండ, అరటిపళ్ళు, తాంబూలం, పువ్వులు సిద్ధం చేసుకోండి. ఇంట్లోని వాళ్ళందరూ తల స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో గాని లేదా, ప్రతిమను కానీ శుభ్రపరచి అలంకరించాలి.

శ్రీ మహాలక్ష్మి ఫోటో ముందు బియ్యం పిండి తో ముగ్గు వేయాలి. ఒక ప్రమిదలో రాళ్ళ ఉప్పు నింపుకొని ఆ ప్రమిద పై అక్షింతలు ఉంచి, దానిపై నూనెతో దీపం వెలిగించాలి. ప్రమిదల చుట్టు, పూలతో అలంకరించాలి. లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన నైవేద్యం పెట్టాలి. ఆ తరువాత శనివారం, ఆదివారం రోజు కూడా దీపం వెలిగించిన తర్వాత పూజకు ఉపయోగించిన ఉప్పు నీటిలో వదిలివేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు.