ఒక కుటుంబం అల్లారు ముద్దుగా పెంచుకున్న తన ఇంటి ఆడపిల్లకి, అంగరంగ వైభవంగా పెళ్లి చేసి, అత్తారింటికి సాగనంపారు. తన కుటుంబానికి గౌరవం ఇచ్చిన అమ్మాయి కూడా సంతోషంగా తలవంచుకొని తాళి కట్టించుకుంది. ఎన్నో ఆశలతో అత్తగారి ఇంటిలో అడుగు పెట్టింది కానీ, అక్కడ అడుగడుగునా ఆమెకు కన్నీరే ఎదురయ్యింది.

కట్టుకున్న భర్త ఆమె పాలిట కాలయముడయ్యాడు. కట్నం ఇంకా కావాలి అంటూ ఆమెను వేధించేవారు. దానికి తోడు కన్నబిడ్డలా చూడాల్సిన అత్తమామలు, ఆడపడుచులు కూడా నష్ట జాతకురాలు అంటూ ఆ అమ్మాయికి క్షణక్షణం నరకం చూపెట్టారు. మెట్టింటి గౌరవం కోసం కట్టుకున్న భర్త పై ఉన్న ప్రేమతో ఆమె తన బాధను అంత మనసులోనే దాచుకొని, అవన్నీ సహిస్తూ వచ్చింది. కొన్నాళ్లకైనా తన భర్త మనసు మారి మంచిగా చూసుకుంటాడని, కలలు కంటూ కష్టాలతోనే వాళ్ళు పెట్టే చిత్రహింసలతోనే కాలం గడిపింది.

కానీ ఆ కష్టం రోజురోజుకీ ఎక్కువ వచ్చింది. చివరికి తాను మేట్టింట్లో పడుతున్న కష్టాన్ని కన్నవాళ్ళ కూడా చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. తన బాధని ఎన్నోసార్లు పోలీసులకు చెప్పి చెప్పి ఆమె కు అలుపు వచ్చింది. చివరకు ఆమె ఊపిరి గాల్లో కలిసి పోవాల్సి వచ్చింది. ఆ సంఘటన చూసిన ఎవ్వరైనా కన్నీళ్లు పెట్టక మానరు. ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు అందరి మనసుల్ని కలిసివేస్తుంది. ఖమ్మం జిల్లా గంధం శ్రీ గ్రామంలో కుటుంబ వారసత్వంగా వచ్చిన నాటువైద్యం చేస్తూ జీవనం సాగిస్తున్న దుర్గాప్రసాద్ కి,

ఇద్దరు కొడుకులు ఒక కూతురు భార్య లేకపోవడంతో చిన్నప్పటినుండి తన కూతురైన లావణ్యని, చాలా అపురూపంగా చూసుకునేవాడు దుర్గాప్రసాద్. పైగా ఉమ్మడి కుటుంబం కావడంతో లావణ్య కూడా అల్లారు ముద్దుగా పెరిగింది. తన కూతురికి పెళ్లి చేసేందుకు బాగానే సంపాదించాడు దుర్గాప్రసాద్, అయితే ఖమ్మంలో నివసిస్తున్న దుర్గాప్రసాద్ దూరపు బంధువులు తన ఆస్తి పై కన్ను వేశారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.