ప్రాచీన వైద్య విధానంలో మనం ఎన్నో రకాల మొక్కలను చూస్తూ ఉంటాం. ఎన్నో రకాల మొక్కలను ఉపయోగించి, వైద్యం చేశారు అనే విషయాన్ని మనం గ్రంథాల ద్వారా, పట్టణాల ద్వారా, మరియు పెద్దల ద్వారా తెలుసుకున్న, ప్రకృతి మనకు ప్రసాదించిన అనేక రకాల మొక్కలు అనేది ఒకటి .ఈ మొక్కల వల్ల మనకు అనేక రకాల రోగాలను, జబ్బులను, మనం దూరం చేసుకుని, మనం జీవనాన్ని సాగిస్తూ ఉన్నాం, అదేవిధంగా ఈరోజు మనం విరిగిన ఎముకలు అతికించే, ఒక మొక్క గురించి తెలుసుకుందాం.

ఇది మనకు విరివిగా కనిపించే మొక్కై, పల్లెటూర్లలో అయితే పొలం గట్ల మీద, అదేవిధంగా రోడ్లకు ఇరువైపులా చక్కగా వేరే మొక్కల పై ఆధారపడి పెరుగుతుంది. ఈ మొక్క దీనినే నల్లేరు అంటారు, నల్లేరు మొక్క చూడడానికి పొడుగ్గా ములక్కాడల అనిపిస్తుంది, మొలగ కాడలాగా ముక్కలలాగా కనులు కనులతో పొడవుగా పెరుగుతుంది. నల్లేరు మొక్క విరిగిన ఎముకలను అతికి స్తుందని తెలిసి పరిశోధనలు చేశారు, వివిధ జంతువుల పై విరిగిన ఎముకలను అతికించడానికి, ఈ నల్లేరు మొక్కను వైద్యంగా వాడారు, తద్వారా వారు తెలుసుకున్నది ఏమిటంటే, ఈ మొక్క నిజంగానే విరిగిన ఎముకలను అతికిస్తుంది.

ఇది ఎముకలను అంటే విరిగిన ఎముకలను అతికిస్తుంది. ఎముకలను రక్షిస్తుంది కాబట్టి ఇది, ఆస్తి సంహారక అయ్యింది. ఈ మొక్క యొక్క ఉపయోగం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, ఇప్పటివరకు జరిగిన ఆధునిక పరిశోధనలు నల్లేరు ఎముకలకు బలాన్ని ఇస్తుంది, అదేవిధంగా విరిగిన ఎముకలను అతికిస్తుంది, అని తెలిసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు నల్లేరు మొక్కను ఎముకలపై పరిశోధన చేసి, వారు 21 రోజులలో ఎముక అతుక్కోవడానికి, ఎక్స్రే తీసి నిర్ధారణ చేసుకొని వాళ్ళు ఆశ్చర్యపోయారు.

నల్లేరు చూడడానికి సన్నగా తీగ మొక్క లాగా ఉంటుంది. చెట్లను ఆధారంగా చేసుకొని పెరిగే ఈ మొక్క గా ఉంటుంది. కణుపులు కణుపులు గా ఉంటుంది. ప్రతి కణుపు దగ్గర సన్నని తీగలు మనకు కనబడతాయి. దీని కాడ అంత నారతో ఉంటుంది. ఒకవేళ ఈ కాడ నలిపితే చేయి దురద పెడుతుంది కూడా, తొక్క తీసే సమయంలో చేతికి నూనె రాసుకోకుండా తొక్క తీయకూడదు, లేదంటే దురద విపరీతంగా ఇబ్బంది పెడుతుంది. నల్లేరు ని బోన్ సెట్టర్ అంటారు, నల్లేరు ని భారతీయ సంప్రదాయ వైద్యంలో పూర్వం నుంచి వాడుతూనే ఉన్నారు..