ప్రతి ఇంట్లో అత్తా కోడళ్ళ విభేదాలు తలెత్తడం సర్వసాధారణం. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు, వీరిద్దరి మధ్య కొడుకు లేదా భర్తలు నలిగిపోతూ ఉంటారు.

అత్తలను హింసించిన కోడలు, అత్త కోడలు పై దుర్భాషలాడుతూ చిత్రహింసలకు గురిచేసిన సందర్భాలు, కూడా మనం చాలా చూశాం. తాజాగా ఒక కుటుంబంలోనే అత్తా కోడళ్ళు కొడుకుకు సంబంధించిన ఒక కేసు హైకోర్టుకు చేరింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.

ఇక అసలు విషయానికి వస్తే భారత సాంప్రదాయం ప్రకారం పెళ్లయిన మహిళ, తన అత్తను ఆ ఇంట్లో ఉండే వృద్ధురాలు అయినా, భర్త అమ్మమ్మలకు కూడా సేవ చేయాల్సిన బాధ్యత ఉంది అంటూ, జార్ఖండ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ బాధ్యతనుండే తప్పించుకోకూడదని వ్యాఖ్యానించింది. అదే సమయంలో తల్లికి భర్తను దూరం చేయకూడదని, దూరంగా ఉండాలి అంటూ ఒత్తిడి కూడా చేయకూడదు అని, కోడలికి హైకోర్టు మొట్టికాయలు వేసింది.

జార్ఖండ్ కు చెందిన రుద్ర నారాయణ రాయని వ్యక్తి, విడాకుల కోసం స్థానిక ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని విచారణ చేసిన ధర్మాసనం భార్యకు నెలకు 30 వేల రూపాయలు, కొడుకుకు 15 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంది అంటూ తీర్పు విలువరించింది. అయితే ఈ తీర్పుకు సంబంధించి రుద్రనారాయణ సంతృప్తి చెందలేదు, మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

అసలు సరైన కారణం లేకుండా భర్తతో విడిపోయేందుకు సిద్ధపడిన మహిళకు, మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కోర్టు భావించింది. అయితే కొడుకుకి ఇస్తున్న మెయింటెనెన్స్ మాత్రం 30 వేల నుండి 25 వేల రూపాయలకు పెంచుతూ, కోర్టు తిర్పు యిచ్చింది. ఈ తీర్పును వెలువరించేందుకు కోర్టు రాజ్యాంగం లోని 51 ఏ ఆర్టికల్ ను రిఫల్ చేసింది. అదే సమయంలో మన వేదాలలో అయినా యజుర్వేద మనస్మతులలో ఉన్న వ్యాఖ్యలు కూడా కోర్టు గుర్తుచేసింది. ఏది ఏమైనా ఇప్పుడు ఈ తీర్పు సంచలనం రేపుతోంది.