సమాజంలో వరకట్నం అనేది, ఒక సామాజిక దురాచారం అన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటికే వరకట్నం లేనిదే పెళ్లి తంతు ముందుకు సాగదు.

దీనివల్ల స్త్రీలపై ఊహకందని రీతిలో చిత్రహింసలు నేరాలు జరుగుతున్నాయి. సామాన్యులే కాదు సంపన్నులు కూడా వరకట్న దురాచారానికి బలైపోతున్నారు. ఒక దశలో ఆడపిల్ల పుట్టింది అంటే కట్న కానుకలు ఇవ్వాల్సి వస్తుందని, తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఏర్పడింది.

దురాచారాన్ని తరిమి కొట్టడానికి ఎంతోమంది మహనీయులు పోరాటం చేశారు. కానీ ఎక్కడో అక్కడ వరకట్నం మరణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వరకట్న దాహానికి మరో మహిళా బలయింది. ఈ ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ గాజుల రామారంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

గాజులరామారంకు చెందిన అభిలాష్, అమరావతి దంపతులకు 2019లో వివాహం జరిగింది. వివాహ సమయంలో నాలుగు కోట్ల వరకు వరకట్నంగా పెళ్లి కొడుకు కుటుంబానికి అప్పగించారు. కొంతకాలం వీరి దాంపత్యం సాఫీగానే సాగింది. ఇటీవల అభిలాష్ కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం, అమరావతిని హింసించడం మొదలుపెట్టారు.

ఇప్పటికే తన తల్లిదండ్రులు ఎంతో కట్నం ఇచ్చారని,ఇక అదనపు కట్నం తీసుకురావడం తన వల్ల కాదని, తేల్చి చెప్పింది అమరావతి. దీంతో ఆమెపై మరింత ఒత్తిడి తీసుకురావడం మానసికంగా శారీరకంగా హింసించడం మొదలుపెట్టారు. ఆగడాలు తట్టుకోలేకపోయింది అమరావతి తీవ్ర మనస్థాపానికి గురై సంచల నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/JkeUfLlCRfE?t=122