మధ్యప్రదేశ్ కు చెందిన ఓ రైతుకు జాక్ పాట్ తగిలింది. నెల రోజుల క్రితం రెండు వందల రూపాయలతో స్థలం లీజుకి తీసుకుంటే 60 లక్షల రూపాయలకు పైగా లాభం వచ్చింది. ఒక్క రోజులో ని ఆ రైతు మిలీనియర్ అయిపోయాడు, ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి..

వివరాల్లోకి వెళితే, మధ్యప్రదేశ్ లో పన్నా ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయి, ఎవరైనా సరే ఇక్కడ కొంత స్థలాన్ని లీజుకు తీసుకుని వజ్రాల కోసం అన్వేషణ సాగించవచ్చు, దీంతో తమకు వజ్రం దొరుకుతుందనే ఆశతో చాలామంది ఇక్కడ నేలను తవ్వి, తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

45 ఏళ్ళ లకన్ యాదవ్ నెల రోజుల క్రితం 200 రూపాయలు చెల్లించి 10*10 అడుగుల విస్తీర్ణంలో ఓ స్థలాన్ని లీజుకి తీసుకున్నాడు. ఆ స్థలంలో తవ్వగా 14.98 క్యారెట్ల వజ్రం దొరికింది. శనివారం వేలం పాత వేయగా 60.5 లక్షల రూపాయలు వచ్చాయి. తాను చదువుకోలేదని, డబ్బులు బ్యాంకులో పిక్స్ డిపాజిట్ చేసి తన పిల్లలకు మంచి చదువు చెప్పి ఇస్తానని తెలిపాడు లకన్ యాదవ్.

పన్నా నేషనల్ పార్క్ కోసం ఖాళీ చేయించిన గ్రామాల్లో లకన్ యాదవ్ ఊరు కూడా ఉంది. గ్రామాన్ని వదిలి వెళ్లిన అందుకు పరిహారంగా ఇచ్చిన డబ్బుతో రెండు ఎకరాల స్థలం కొనుగోలు చేశాడు. వజ్రాన్ని డిపాజిట్ చేయగానే అధికారులు రెండు లక్షల రూపాయలు ఇచ్చారు. మేనల్లుడి బలవంతం మీద ఆ మొత్తంలో ఓ బైక్ కొనుగోలు చేశాడు, కానీ తనకు సైకిల్ సౌకర్యవంతంగా ఉంటుందని యాదవ్ చెప్పడం గమనార్హం. ఓసారి వజ్రం దొరకడంతో, మరోసారి వజ్రాల వేట కోసం వస్తానని నాకు మల్లి వజ్రం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియో చూడండి.

https://youtu.be/a2THOiynMfY?t=98