Uncategorized

విపరీతమైన భుజం నొప్పి వస్తుందా… దీనిని ఎలా నివారించాలంటే…

భుజం నొప్పి వస్తుందా… దీనిని ఎలా నివారించాలంటే…

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కాళ్ళు నొప్పి, చేతులు నొప్పి ఇలా ఏదో ఒక నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నోప్పులతో పాటు భుజం నొప్పి కూడా తీవ్రమైనది. అయితే ఒక్కొక్కసారి ఉన్నట్టుండి తీవ్రమైన భుజం నొప్పి కూడా వస్తూ ఉంటుంది. ఈ నొప్పి వలన పక్కకు కూడా కదల్లేని పరిస్థితి వస్తుంది. ఇలాంటి నొప్పులను సాధారణ నోప్పి అనుకుంటే పొరపాటే. ఈ నోప్పులను తగ్గించుకోవడానికి మందులు లేక పెయిన్ రిలీఫ్ జెల్ ను రాసుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేయటం వలన నొప్పులు తగ్గవు. దీనిని ఫ్రోజెన్ షోల్డర్ అని పిలుస్తారు. దీనిని వైద్య పరిభాషలో అడేసివ్ క్యాప్స్ లిటిస్ అని కూడా అంటారు. సాధారణంగా ఈ వ్యాధి అనేది భుజాల కండరాల, మెడ, కీళ్ళను కూడా ప్రభావితం చేయగలదు.

అలాగే చేయి భుజాలను కలిపే ఎముకలు మరియు స్నాయువులు కణజాలాలతో కప్పబడి ఉంటాయి. ఈ కణజాలం అనేది వాపు లేక గట్టిగా మారినప్పుడు బిగుసుకుపోయి భుజం నొప్పి అనేది వస్తుంది…పురుషులు మరియు మహిళలు అందరిలోనూ ఈ రకమైన సమస్య అనేది భుజం లో తలెత్తుతుంది. అయితే మహిళలు మాత్రం ఎక్కువగా ఎముకల సమస్యతో ఇబ్బంది పడతారు. వారిలో భుజం యొక్క కండరాలు అనేవి బిగుసుకుపోయే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంది. ఈ సమస్య అనేది ముఖ్యంగా 40 నుండి 60 ఏళ్ల వయసు గల వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఎంతో మంది దీనిని ఆర్ధరైటిస్ నొప్పి లేక ఏదైనా గాయం వలన వచ్చిన నొప్పి అని అనుకుంటారు.కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదు.

అయితే ఫ్రొజెన్ షోల్డర్ సమస్య ఉన్నవారిలో భుజ బాగం లో మాత్రమే నొప్పి అనేది మొదలవుతుంది. దీని ఫలితంగా చెయ్యి కదలడానికి కూడా కష్టం అవుతుంది. అయితే ఎంతోమంది ఈ రకమైన భుజం నొప్పితో బాధపడుతూ ఉంటారు… ఫ్రొజెన్ షోల్డర్ నొప్పును ఎలా వదిలించుకోవాలంటే : ఈ నొప్పి నివారణకు మందులు వాడటం లేక లేపనాలు వేయడం వలన ఫ్రొజెన్ షోల్డర్ సమస్యకు పెద్దగా ప్రయోజనాలు ఏమీ ఉండవు. అయితే కొద్ది రోజుల తర్వాత ఈ నొప్పి అనేది దానంతట అదే తగ్గిపోతుంది. అయితే ఎన్నోసార్లు వైద్యులు కూడా స్టెరాయిడ్స్ తీసుకోవాలి అని చెబుతూ ఉంటారు. అలాగే ఇంజక్షన్లు కూడా ఇస్తూ ఉంటారు. వీటితోపాటుగా వైద్యుల చెప్పిన ప్రకారం వ్యాయామాలు చేస్తే కూడా ఫలితం ఉంటుంది. అయితే వ్యాయామం చేయడం వలన ఘనీభవించిన భుజం నొప్పిని నియత్రిస్తుంది…