సమ్మర్ సీజన్ మొదలయ్యింది. ఎండలు మండిపోతున్నాయి, ఉదయం 10 దాటింది అంటే సూర్యుడు ప్రతాపం మొదలవుతుంది. ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టామంటే చాలు,

ఉక్క పోత చెమట పట్టడం సహజం. మన శరీరం నుండి పోషకాలు కోల్పోవడమే దీనికి కారణం. అయితే దీన్ని బ్యాలెన్స్ చేసేందుకు చాలా మంది వేసవిలో పుచ్చకాయలను ఎక్కువగా తింటుంటారు. పుచ్చకాయల్లో లైకోపిన్,యాంటీ యాక్సిడెంట్, హెల్మెట్స్, విటమిన్స్ ఏ, విటమిన్ సి, పొటాషియం, ఎమినో ఆసిడ్స్ అధికంగా ఉంటాయి. అలాగే బరువు తగ్గాలని ప్రయత్నించే వారు కూడా ఈ పండు బాగా ఉపయోగపడుతుంది.

ఇందులో కేలరీలో చాలా తక్కువ కాబట్టి, ఈ పండును తీసుకోవడం వల్ల మన పొట్ట ఎక్కువ సమయం నిండుగా ఉంటుంది. ఈ పండు వేసవిలో ఎండ వేడి నుండి మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే ఇందులో 92% నీరు ఉంటుంది. కాబట్టి ఇది మన శరీరానికి ఎక్కువ వాటర్ కంటెంట్ అందిస్తుంది తాజా పుచ్చకాయల్లో సిట్రలిన్ అనే ముఖ్యమైన ఐమోన్ ఆమ్లం ఉంటుంది.

ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. పుచ్చకాయ శరీరంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రిస్తుంది. డయాబెటిక్ చేసేవారికి కూడా పుచ్చకాయ చాలా మంచిదే, కానీ కొందరు పుచ్చకాయను రిఫ్రిజిరేటర్ లో ఉంచి తింటారు. ఇలా తినడం వల్ల పోషక విలువలు తగ్గుతాయ్ అంటున్నారు నిపుణులు. సాధారణంగా మార్కెట్ నుండి పండును కొనుక్కోలు చేసి, ఇంటికి తెచ్చిన తర్వాత వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచుతారు.

పండును కట్ చేసి ఫ్రిజ్లో ఉంచే అలవాటు ఉంటే మాత్రం వెంటనే దానిని మానుకోండి. పుచ్చకాయను ఫ్రిజ్లో ఉంచడం కంటే గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిదనే పరిశోధకులు చెబుతున్నారు. ఎంత ఎండలోనైనా పుచ్చకాయ చాలా చల్లగా ఉంటుంది, తినడానికి రుచికరమైనది కానీ కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో ఉంచితే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు. సాధారణంగా కోసిన పుచ్చకాయపై బ్యాక్టీరియా పెరగడం కారణం అవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం అందుకే పుచ్చకాయను ఫ్రిజ్లో పెట్టకపోవడం మంచిది.