ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ హత్య, కేసు సంచలనం సృష్టించింది. మొదట ఏదో గుర్తుతెలియని వాహనం డీ కొట్టి చనిపోయిన కేసుగా భావించారు.

కానీ మృతుడి అన్న కొడుకు సొంతంగా చేసిన ఇన్వెస్టిగేషన్ హత్య వెనుక మిస్టరీని ఛేదించింది. ఒక సామాన్యుడు చేదించిన ఈ కేసు పై పోలీసుల షా క్ అయ్యారు. ఆ త్రిల్లింగ్ స్టోరీ ఏంటో చూద్దాం. కాన్పూర్ దగ్గరలోని సుబోలి గ్రామంలో ఉంటూ, పక్క గ్రామంలోని ప్రభుత్వ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నాడు రాజేష్.

ఒకపక్క జాబ్ చేసుకుంటూనే రియల్ ఎస్టేట్ పనులు చేస్తూ భారీగా సంపాదించాడు. టీచర్ జాబ్ చేస్తూ వ్యాపారాలు చేయడం యూపీలో కూడా ఇది ఒక అంటు వ్యాధుల మారిపోయింది. పిల్లల చదువును గాలికి వదిలేస్తున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు రాజేష్ ఉధంతంతో మరోసారి రుజువయింది.

అయితే రాజేష్ రోజు ఉదయం 6 గంటలకు జాగింగ్ కి వెళ్లడం అలవాటు. తన ఇంటి నుంచి మెయిన్ రోడ్డు పక్కకు ఉదయాన్నే జాగింగ్ చేస్తూ ఉంటాడు. ఏడు గంటలకు ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. అలానే నవంబర్ 4 న ఉదయం 5:05 నిమిషాలకే జాగింగ్ కోసం శూ వేసుకొని వెళ్ళాడు. కానీ 7 గంటలైనా తిరిగి రాలేదు. సరిగ్గా ఆ సమయంలోనే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రాజేష్ భార్య ఊర్మిళ అలియాస్ పింకీ కి కాల్ చేశాడు. మీ భర్త చనిపోయాడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.

వేగంగా వెళుతున్న ఏదో వాహనం ఢీ కొట్టి చనిపోయాడని చెప్పకు వచ్చాడు. దీంతో రాజేష్ భార్యతో పాటు అతన్ని సోదరులు తల్లిదండ్రులు బోరున విలపిస్తూ అక్కడికి చేరుకున్నారు. పోలీసులకో సమాచారం ఇవ్వడంతో ప్రమాదం చేసి వెళ్లిన వాహనాన్ని గుర్తిస్తామని హామీ ఇచ్చారు. ఇక పోస్ట్మార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలు కూడా ముగిశాయి రాజేష్ పిల్లలైతే నాన్న కోసం తపించి పోయారు. మరోవైపు భర్త చనిపోయారని, భార్య మంచం పట్టింది. ఇక పోలీసులు ఈ కేసు గురించి విచారణ చేసినా కూడా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత వదిలేశారు. గ్రామంలో సిసిటీవీ కెమెరాలు లేవు కాబట్టి గుర్తించలేమన్నారు పోలీసులు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..